అద్దంకిలోని సత్రం బడిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు
అద్దంకి పట్టణంలోని సత్రం బడిని సోమవారం మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థుల హాజరు శాతాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి తరగతుల వారీగా వారి సామర్థ్యాన్ని పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. భవిత కేంద్రాలలో ప్రభుత్వం అందిస్తున్న సేవలను గురించి ఎంఈఓ శ్రీనివాసరావు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరిగిన సిలబస్ గురించి ఆయన ఆరా తీశారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన మెరుగైన విద్యను అందించాలని సూచించారు.