మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో జనవరి 20వ తేదీ మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో అలసందలపల్లి తాటిచెర్ల మోటు పరిసర ప్రాంతాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.