గుమ్మలక్ష్మీపురంలో స్వచ్ఛందంగా పారిశుద్ధ్య పనులు చేపట్టిన మహిళలు..
గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు ఆధ్వర్యంలో గడ్డికాలనీలో సోమవారం మద్యాహ్నం పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ పిలుపు మేరకు కాలనీలో మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీధులను శుభ్రం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంలో గ్రామంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, తద్వారా ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చని గ్రామస్థులకు సూచించారు.