అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని కూడేరు మండలం గుడ్కూరు రోడ్డులో గుర్తు తెలియని వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.