ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలి:జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్
Anantapur Urban, Anantapur | Nov 17, 2025
అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అర్జీలను స్వీకరించారు.జిల్లా కలెక్టర్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఏ.మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మల్లికార్జున రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 395 అర్జీలను స్వీకరించారు.