యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ) వ్యాఖ్యలపై నటి కరాటే కళ్యాణి మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ పాస్‌పోర్టును “దరిద్రపుగొట్టు పాస్‌పోర్టు” అంటూ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని అవమానించేలా ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. దేశ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన అన్వేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, అతడి పాస్‌పోర్టును రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని కరాటే కళ్యాణి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పాస్‌పోర్టు అథారిటీకూ అధికారికంగా ఫిర్యాదు చేస్తామని తెలిపారు.