జిల్లా అభివృద్ధి చెందే విధంగా అధికారులు సమన్వయంతో సమిష్టి కృషి చేయాలి: ఎంపీ తనుజా రాణి
పార్వతీపురం జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా అధికారులు సమన్వయంతో సమష్టి కృషి చేయాలని అరకు పార్లమెంట్ సభ్యురాలు తనూజా రాణి అన్నారు. బుధవారం ఉదయం పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, వివిధ శాఖల ప్రగతిపై అధికారులతో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న అభివృద్ధి పనులను సమన్వయంతో సమష్టిగా పనిచేసి లక్ష్యాలను సాధించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.