భీమిలి: ఉడాకాలనీలో బడ్డీల తొలగింపులో జేసీబీ పైకి ఎక్కి కింద పడి మరణిస్తా అంటూ నిరసన తెలిపిన చిరు వ్యాపారి
మధురవాడ మిదిలాపురి ఉడాకాలనీలో బడ్డీల తొలగింపు జీవీఎంసీ అధికారులు నిర్వహించారు. ఈ తొలగింపులో జీవీఎంసీ అధికారులను మానం శ్రీను చిరు వ్యాపారి జీవీఎంసీ అధికారులను తమ బడ్డీ తొలగించవద్దని వేడుకున్నాడు. అధికారులు ఆయన అభ్యర్ధనను తిరస్కరించటంతో జేసీబీ పైకి ఎక్కి ఈ జేసీబీ కింద పడి మరణిస్తా అంటూ ప్రతిఘటించాడు. పోలీసులు అతనికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన ఫలితంలేకపోవటంతో తీవ్ర గందరగోళం నెలకొంది.