బందరులో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం, స్తంభించిన జనజీవనం, రోడ్లన్నీ జలమయం
Machilipatnam South, Krishna | Sep 21, 2025
బందరులో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం, స్తంభించిన జనజీవనం, రోడ్లన్నీ జలమయం బందరులో భారీ వర్షం స్తానిక మచిలీపట్నంలో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ఒక్కసారిగా కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమై, జనజీవనం స్తంభించింది. భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. రాబొయే రెండు రోజుల్లో భారీ నుండి అతిభారీ గా వర్షాలు పడతాయని వాతావరణశాఖా ఆధికారులు తెలిపారు.