ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో మీడియాకు ఓ ప్రకటనలో తెలిపారు. ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అనంతపురం కలెక్టరేట్, అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ : 8500292992. అనంతపురం ఆర్డీఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ నెంబర్ : 9493188818. కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ నెంబర్ : 8309598111.