నాయుడుపేటలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం లోతువానిగుంటలో ఆదివారం తృటిలో ప్రమాదం తప్పింది. గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో బీరువాలో దాచిన 2 లక్షల నగదు బంగారు ఆభరణాలు ఇతర గృహపకరణాలు మంటలకు ఆహుతి అయ్యాయని బాధితులు వాపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.