సంగారెడ్డి: కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్ లను నిరసిస్తూ సంగారెడ్డి పట్టణంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను నిరసిస్తూ సంగారెడ్డి పట్టణంలో బుధవారం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి పట్టణంలోని కేకే భవన్ నుంచి కలెక్టరేట్ సమీపంలో గల ఐలమ్మ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించగా కార్మికులు భారీ ఎత్తున పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.