అసిఫాబాద్: బోడపల్లి గ్రామపంచాయతీకి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని కలెక్టర్ కు వినతి పత్రం
78 సంవత్సరాలు గడుస్తున్న నేటి వరకు బోడపల్లి గ్రామ పంచాయతీకి ఎస్టీ రిజర్వేషన్ రాలేదని ఆదివాసి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ASF కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు.. కాగజ్ నగర్ (M) బోడపల్లి గ్రామ పంచాయతీలో ఎస్సీలు,బీసీలకు మాత్రమే ఇప్పటి వరకు సర్పంచుల రిజర్వేషన్లు వచ్చాయని తెలిపారు. వచ్చే స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో బోడపల్లి జీపీకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.