మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం తమ్మడపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వింత ఆచారం చోటు చేసుకుంది. చెన్నకేశవ స్వామిని పూజించే కొందరు అంకాలమ్మ ఆలయం వద్ద నైవేద్యం తయారు చేసుకుని నేల తాళాలతో కత్తి సాముతో ఊరేగింపుగా వెళ్లి లింగమయ్య స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ప్రతి సంక్రాంతి పండగకు ఈ విధంగా చేయడం పూర్వీకుల నుండి ఆనవాయితీగా వస్తుందని వారన్నారు.