వైరా: వైరా మున్సిపాలిటీ ఎదుట సిపిఎం పార్టీ నాయకులు నిరసన
Wyra, Khammam | Sep 22, 2025 ఖమ్మం జిల్లా,వైరా మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని మున్సిపాలిటీ కార్యాలయం ముందు CPM పార్టీ ఆధ్వర్యంలో నిరసన. చేపట్టారు సమస్యల పై శాశ్వత పరిష్కారం చేపట్టాలని డిమాండ్ చేసారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ మున్సిపాలిటీ ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తవుతున్న 20 వార్డుల్లో సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు.మున్సిపాలిటీ వార్డుల్లో,డ్రైనేజీ నిర్మాణాలు డంపింగ్ యార్డ్ సమస్యలు అంతర్గత రహదారులు అస్తవ్యస్తంగా నిలిచిపోయాయని విమర్శించారు ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు