రూ.10 వేల సంతకాలు సేకరించి MLC మేరిగ మురళీధర్ కి అందజేసిన వైసీపీ నాయకులు
Gudur, Tirupati | Nov 18, 2025 కోటిసంతకాల సేకరణలో కోట మండలం నుంచి రూ.10 వేల సంతకాలు సేకరించి మంగళవారం ఎమ్మెల్సీ, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరిగ మురళికి అందించారు. గూడూరు కార్యాలయంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. కోట వైసీపీ నాయకులు కోటి సంతకాల సేకరణలో క్షేత్ర స్థాయిలో చక్కగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోట మండల అధ్యక్షులు సంపత్‌రెడ్డి, పేట రాజీవ్ రామిరెడ్డి, సాయి ప్రసాద్, నాగరాజు, సురేంద్ర, సురేశ్ పాల్గొన్నారు.