నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో అక్రమంగా తయారీ, నిల్వ, రవాణా చేసిన నిషేధిత మద్యాన్ని జిల్లా ఎక్సైజ్, పోలీస్ అధికారులు ఆధ్వర్యంలో మంగళవారం ధ్వంసం చేశారు. టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 32 కేసుల్లో 680 లీటర్ల నాటు సారా, 11 కేసుల్లో 180 క్వార్టర్ మద్యం బాటిళ్లు, ఎక్సైజ్ స్టేషన్లో 52 కేసుల్లో 161.25 లీటర్ల మద్యంను ధ్వంసం చేశారు. అలాగే 8 వాహనాలకు వేలం వేయగా 7 వాహనాలు అమ్ముడయ్యాయనీ డోన్ ఎక్సేంజ్ సీఐ వరలక్ష్మి తెలిపారు.