మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో త్వరలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేస్తామని టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. పేదలకు అన్నదానం ఏర్పాటుచేసిన అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం దూరం చేసిందని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్వరలో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామన్నారు.