గుడిహత్నూరు: తడిసిన ప్రతీ గింజని ప్రభుత్వం బేషరతుగా కొనాలి : బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్
అకాల వర్షాల కారణంగా కురిసిన వర్షాలకు నియోజకవర్గంలో అనేక మంది రైతులు జోన్నలు తడిసి ఇబ్బందులు పడుతున్న సందర్భంగా శుక్రవారం నెరడిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ సందర్శించారు. ఈ సందర్భంగా జొన్నలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని తడిసిన ప్రతీ ధాన్యం గించను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తప్పకుండా కొనే విధంగా బీఆర్ఎస్ పార్టీ తరపున ఒత్తిడి తీసుకొస్తామని తాను సైతం దగ్గరుండి కొనేలా చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు.