కొరిశపాడులో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో పాల్గొన్న MDO రాజ్యలక్ష్మి
కొరిశపాడు మండల పరిషత్ కార్యాలయం హాలు నందు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎండిఓ రాజ్యలక్ష్మి తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడవద్దని, అభివృద్ధికి కావలసిన నిధులు డబుల్ ఇంజన్ సర్కార్ సమృద్ధిగా ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష సమావేశంలో తెలిపారు. జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో మండల స్థాయి అధికారులు ముందుకు పోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అభివృద్ధికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు.