మార్కాపురం జిల్లా సాధించడమే కాకుండా అభివృద్ధి చేసి చూపుతామని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఆయన కార్యాలయంలో చెరువును ట్యాంక్ బండ్ గా మార్చి అన్నగారి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. అల్లూరి పోలేరమ్మ ఆలయం వైపు కలెక్టరేట్ కార్యాలయమును అభివృద్ధి చేస్తామన్నారు. మరోవైపు స్టేడియం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఐదు సంవత్సరాలలో మార్కాపురం జిల్లా రూపురేఖలు మారుస్తామని పేర్కొన్నారు