కొణతమాత్కూరులో కొండచిలువ కలకలం, కొట్టి చంపిన స్థానికులు
Nandigama, NTR | Sep 21, 2025 నందిగామ మండలం కొనతమాత్కూరులో కొండచిలువ కలకలం రేపింది శనివారం రాత్రి 7 గంటల సమయంలో నివాసాల మధ్యకు కొండచిలువ రావడంతో స్థానికులు భయపడిపోయారు. వెంటనే జెసిబి సాయంతో దానిని బయటకు తీసి కర్రలతో కొట్టి చంపడంతో ఊపిరి పీల్చుకున్నారు.