ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం లో సోమవారం విపరీతంగా పొగ మంచు కురవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఉదయం 10 గంటల వరకు కూడా పొగ మంచు విపరీతంగా పడుతూ ఉండడంతో రహదారి కనిపించక వాహనదారులు అవస్థలు పడినట్లుగా స్థానికులు చెప్పిన వివరాల మేరకు తెలుస్తుంది. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం అత్యధికంగా ఉన్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వాహనాలు నడపలని పోలీసులు వాహనదారులను హెచ్చరిస్తున్నారు.