సిర్పూర్ టి: సైబర్ మోసగాడిని అరెస్టు చేసిన సిర్పూర్ టి పోలీసులు ; వివరాలు వెల్లడించిన కౌటాల సిఐ సంతోష్ కుమార్
సైబర్ మోసాలకు పాల్పడుతున్న మోసగాడిని ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో సిర్పూర్ ఎస్సై సురేష్ కుమార్ అరెస్ట్ చేశారు. గూగుల్ రివ్యూలు, క్రిప్టో పెట్టుబడుల పేరుతో సిర్పూర్ యువకుడిని మోసగించిన సైబర్ నేరస్తుడు అభిషేక్ కుమారును నోయిడాలో అరెస్టు చేసినట్లు కౌటాల సిఐ సంతోష్ కుమార్ మంగళవారం సిర్పూర్ టి పోలీస్ స్టేషన్ లో తెలిపారు. సిర్పూర్ ఎస్ఐ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది నిందితుడు అభిషేక్ కుమార్ ను నోయిడాలో అరెస్టు చేసి నోయిడా కోర్టులో హాజరు పరిచి కేసు విచారణ నిమిత్తం నిందితుడిని సిర్పూర్ తీసుకు వచ్చినట్లు కౌటాల సిఐ సంతోష్ కుమార్ తెలిపారు,