హిమాయత్ నగర్: కాంగ్రెస్ బిజెపి నేతలు బీసీలను నమ్మించి నయవంచలకు గురి చేశారు : బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
ఇందిరా పార్కు వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలు, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదివారం మధ్యాహ్నం మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి నేతలు బీసీలను నమ్మించి నయవంచనకు గురి చేశారని అన్నారు మాకు సర్పంచ్ సీటు ఇవ్వకుంటే మేము మీ సీఎం సీటు గుంజుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ బిజెపిలో పార్టీ పరంగా ఇస్తామన్న 42 శాతం టికెట్లు కూడా బూటకమని తేలిపోయిందని అన్నారు. సీఎం అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లాల్సిందేనని లేకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.