నంద్యాల జిల్లా అవుకు మండలం మంగంపేటలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం ప్రకృతి ఒడిలో అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది. కొండల మధ్య ప్రకృతి రమణీయ ప్రదేశంలో రాతి శిలలతో నిర్మాణాన్ని నిర్వాహకులు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. గతంలో కాశిరెడ్డినాయన ఇక్కడే సంచరించి అన్నదానం చేసేవారని గ్రామస్థులు తెలిపారు. నాటి నుంచి నేటి వరకు నిత్యం అన్నదానం కొనసాగుతోంది. ఆయన పేరు మీద రహదారులు, ఆలయాల్లో నిరంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది