భీమిలి: జాతర శిల్పారామం వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ డీ డ్రైవర్ కి గాయాలు
మధురవాడ జాతర శిల్పారామం వద్ద జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని మరో లారీ డీ కొన్నట్లు స్థానికులు తెలిపారు. డీ కొన్న లారీ డ్రైవర్ కు గాయాలు అవ్వగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పీఎంపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ క్రమబద్దికరిస్తున్నారు.