నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు రౌడీషీటర్లు, చెడు నడత కల్గిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ గారి ఆదేశాల మేరకు సి.ఐ లు, ఎస్సైలు విస్తృతంగా కౌన్సిలింగ్ చేపట్టారు. సత్ప్రవర్తనతో నడుచుకోవాలని తెలియజేశారు. నేరాలకు దూరంగా ఉండాలి, సత్ప్రవర్తనతో జీవించాలి.అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు.గంజాయి, మత్తుపదార్థాల వినియోగం లేదా రవాణా చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటాం.చెడు వ్యసనాలను మాని, మంచి నడవడికను అలవర్చుకోవాలి.