మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని రాజుపాలెం కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆహారాన్ని భుజించిన ఆయన ఆహారం నాణ్యత పై సంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత విద్యార్థులతో మాట్లాడి ప్రతిరోజు మెనూ ప్రకారం అందిస్తున్న ఆహారం వివరాలను అడిగారు. అతి త్వరలో వస్తున్న పరీక్షల నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులు ఆందోళనకు గురి కాకుండా బాగా చదువుకొని పరీక్షలు బాగా రాయాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి విద్యార్థులతో చెప్పారు.