అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ సోమవారం ఉదయం 11 గంటల సమయంలో స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పి జి ఆర్ ఎస్ ) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుండి వివిధ సమస్యలపై 122 అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, వాటిని తక్షణమే పరిశీలించి చట్టపరిధిలో పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన పిటిషనర్లు మరియు వారి వెంట వచ్చిన వారికి ఇస్కాన్ సంస్థ వారి సహకారంతో ఉచిత భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసు అధికారులు పాల్గొని స్వయంగా వారే భోజనం వడ్డించారు.