కొత్తగూడెం: రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారన్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారని అన్నారు. చెరువుల ఆక్రమణలపై శ్వేత పత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐపీఎస్ రంగనాథ్ మంచి మనిషి అని… పనిలో స్పీడ్ ఉందని కూనంనేని కొనియాడారు. చెరువులు, శికం భూమిలో పర్మిషన్ ఇచ్చిన అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ను రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కవిత ఒక ఆడపిల్ల అని.. ఆమె తప్పు చేసిందా ఒప్పు చేసిందా అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయని పేర్కొన్నారు.