శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా శుక్రవారం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నివాళులర్పించారు. జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. అదేవిధంగా కూటమి నేతలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొని జ్యోతిబాపూలేకు నివాళులర్పించారు.