ఆటో డ్రైవర్లు వాహన మిత్ర కు దరఖాస్తు చేసుకోవాలి: కొరిశపాడు ఎండిఓ రాజ్యలక్ష్మి సూచన
కొరిశపాడు మండలంలో సొంత ఆటో కలిగిన డ్రైవర్లు గ్రామ సచివాలయం వద్ద వాహన మిత్ర కు దరఖాస్తు చేసుకోవాలని ఎండిఓ రాజ్యలక్ష్మి బుధవారం సూచించారు. దరఖాస్తు ఫారం లో వివరాలన్నీ నమోదు చేసి సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్లకు అందజేయాలని సూచించారు. రెన్యువల్ చేసుకునే వారికి ఈనెల 19 లో అవకాశం ఉన్నట్లు చెప్పారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి 20వ తేదీన లాగిన్ ఓపెన్ అవుతుందని ఎండిఓ రాజ్యలక్ష్మి తెలియజేశారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా ఉండాలని ఆమె పేర్కొన్నారు.