కళ్యాణదుర్గంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయాన్ని మంగళవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే హాజరై వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు వినియోగం చేశారు. సుమారు అరగంట పాటు ఎమ్మెల్యే ఆలయంలో గడిపారు.