వేములవాడ: రాజన్నను దర్శించుకున్న కరీంనగర్ కలెక్టర్
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వస్తితో స్వాగతం పలికారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు నమిలికొండ రాజేశ్వర్ శర్మ ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. వారి వెంట ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్, పర్యవేక్షకులు శ్రీకాంత్ చారి, ఆలయ సిబ్బంది ఉన్నారు.