ప్రకాశం జిల్లా దర్శి కురిచేడు మండలాలలో టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆంధ్రుల ఆరాధ్య దైవం, కారణజన్ముడు రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి అన్నారు. నేటికీ అమలు చేస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. ఆయన చూపిన బాటలోనే ప్రతి ఒక్కరు ముందుకు నడవాలన్నారు.