రాజేంద్రనగర్: గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు RR జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. కొంగరకలాన్లోని RR జిల్లా కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. జిల్లాలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వాహణకు 93 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 55,692 మంది పరీక్ష రాయనున్నట్లు తెలిపారు