సంగారెడ్డి: మహిళ సాధికారిత తోనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి : మంత్రి దామోదర్ రాజనర్సింహ
మహిళ సాధికారికతోని రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి దామోదర్ రాజనర్సిమా అన్నారు. సంగారెడ్డి జిల్లా అందరు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని మహిళ సంఘాలకు మంజూరైన వడ్డీ లేని రాయితీని మంగళవారం మంత్రి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని 4039 మహిళా సంఘాలకు 4.52 కోట్లు, జిల్లాలో 15,909 సంఘాలకు మొత్తం 18.25 కోట్లు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి వీధి శాఖల అధికారులు పాల్గొన్నారు.