ములుగు: శునకంపై కూర్చోని కోతి సవారి, కమలాపురంలో వైరల్ వీడియో
Mulug, Mulugu | Sep 16, 2025 కోతులు కనిపిస్తే కుక్కలు వాటిపై దాడి చేసేందుకు ప్రయత్నించడం సాధారణంగా నిత్యం చూస్తుంటాం. అయితే మంగపేట మండలం కమలాపురంలో మంగళవారం సాయంత్రం ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఓ శునకంపై వానరం కూర్చోని సవారి చేస్తుండడం పలువురు ఆసక్తిగా తిలకించారు. శునకంపై కూర్చొని ప్రధాన రోడ్లు, విధుల్లో చక్కర్లు కొడుతూ స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనను పలువురు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించగా, ప్రస్తుతం వైరల్ గా మారింది.