అసిఫాబాద్: ఆసిఫాబాద్ లోని ఓ మొబైల్ షాప్ లో అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తినష్టం
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వివేకానంద చౌక్ వద్ద మంగళవారం అర్దరాత్రి ఓ మొబైల్ షాప్లో షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేసరికి షాపులోని వస్తువులు, సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ. 25 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు స్థానికులు తెలిపారు.