ఏసీబీ వలలో ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడిలో టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టు బడ్డారని ఏసీబీ డీఎస్సీ సోమన్న మంగళవారం తెలిపారు, ఒక కేసులో స్టేషన్ బెయిల్ మంజూరు చేయడానికి 35000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం, ఇప్పటికే 20000 ఇవ్వగా, మిగిలిన 15000 కోసం ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించాడని వెల్లడించారు