శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని మాధవ గురుకులంలో బుధవారం ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం న్యాయవాది సుబ్బరాజు గుప్తా మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధురాలు బ్రిటీషర్లను ఎదిరించిన వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయిని అన్నారు. ఆమె జీవిత చరిత్ర ఎందరికో స్ఫూర్తి అని, స్వతంత్రం కోసం ఆమె చూపిన తెగువ మర్చిపోలేనిదని విద్యార్థులకు తెలియజేశారు.