ప్రకాశం జిల్లా నిరుద్యోగ మహిళలకు బ్యూటీపార్లర్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూడ్సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నవంబర్ 25& డిసెంబర్ 29 వరకు ఒంగోలులోని రూడ్సెట్ శిక్షణ ఇస్తామన్నారు. 19ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు మహిళలు అర్హులన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి, సదుపాయాలు ఉంటాయని అన్నారు. ఆసక్తి గలవారు ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ కాలేజీ వద్ద గల రూడ్ సెట్ కు రావాలన్నారు. ఈ విషయాన్ని సంస్థ డైరెక్టర్ బుధవారం సాయంత్రం 6 గంటలకు తెలిపారు.