ఈనెల 12/13-01-2026 తేదీల మధ్య అర్ధ రాత్రి సమయంలో అనంతపురంనగరంలోని నంబూరి వైన్ షాపుపై దాడి చేయడంతో పాటు నిప్పంటించి సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం కలిగించిన ఘటనకు సంబంధించి శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు నాల్గవ పట్టణ సి.ఐ జగదీష్ తెలిపారు. అరెస్టయిన నిందితుల వివరాలు అనంతపురంలోని లక్ష్మీ నగర్ కు చెందిన దొండ్లగు మోహన్ కుమార్, అఖిల్ కుమార్ (మోహన్ కుమార్ తమ్ముడు),కళావతి కొట్టాలకు చెందిన బాబా ఫక్రుద్దీన్ ఈ ముగ్గుర్ని అనంతపురం ఎక్సైజ్ కోర్టులో హాజరు పరిచామని ఈ ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారన్నారు.