అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని రాప్తాడు సమీపంలో కాలువ గట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాండ్లపర్తి గ్రామానికి చెందిన శివయ్య అనే గోపాలమిత్ర మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.