అనంతపురం నగరంలోని సాయిబాబా ఆలయంలో దేవుడి శఠగోపాన్ని దొంగ ఎత్తుకెళ్లాడు. సామాన్య భక్తుడిలా వచ్చి దేవుడిని మొక్కుతున్నట్లు నటించి శఠగోపాన్ని తీసుకెళ్లే దృశ్యాలు సిసి కెమెరాలు రికార్డు అయ్యాయి. జిల్లా కేంద్రంలోని చెరువు కట్టపై ఉన్న సాయిబాబా ఆలయంలో ఈ చోరీ చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో సీసీ ఫుటేజీ పరిశీలించిన ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.