భీమిలి: ఆనందపురం ఉన్నత పాఠశాల విద్యార్థులతో విద్యా వ్యవస్థ పటిష్టానికి సంస్కరణలు తీసుకు వచ్చాం, భీమిలి ఎమ్మెల్యే గంటా
విద్యా వ్యవస్థను పటిష్టపరిచే దిశగా కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకు వచ్చిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. దివీస్ లాబొరేటరీస్ సౌజన్యంతో ఆనందపురం హైస్కూల్ విద్యార్థులకు సైన్స్ కిట్లను శనివారం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ అమలు చేస్తూ జరిపిన 15,347 మంది టీచర్లు నియామకం ప్రభుత్వానికి విద్యారంగం పట్ల ఉన్న అంకితభావాన్ని తెలియ జేస్తోందన్నారు. 2014 - 19 లో టీడీపీ హయాంలో తాను విద్యాశాఖ మంత్రిగా మూడు డీఎస్సీలను నిర్వహించామని, ఒక ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్క డఎస్సి నిర్వహించ లేదన్నారు.