కుప్పం: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కుప్పంలో అవగాహన ర్యాలీ
జ్ఞానమే ఎయిడ్స్‌కు మందు అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ హెచ్ఐవీ పట్ల ప్రజలకు అవగాహన కల్పించి నిశ్శబ్దాన్ని చేధించాలని డా. సుభాష్ రాజా పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కుప్పంలో విద్యార్థులు, వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ పట్ల ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు.