మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన 9 మందికి రూ.90,000 జరిమానా
తిరుపతి జిల్లా తడ మండలం పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ K.కొండపనాయుడు హెచ్చరించారు. శనివారం తడ పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. కేసులు నమోదు చేసిన వారిలో 9 మందిని సూళ్లూరుపేట న్యాయస్థానంలో హాజరు పరచగా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున మొత్తం 90,000రూపాయలను న్యాయమూర్తి జరిమానా విధించినట్లు తెలిపారు. ఇదే తరహాలో వాహనాలు తనిఖీలను ముమ్మరం చేసి మద్యం సేవించి వాహనాలు నడిపే వారి ఆగడాలను అరికడతామని ఎస్ఐ K.కొండపనాయుడు తెలి