అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలోని సన్ రైజర్స్ పాఠశాలలో కరస్పాండెంట్ మారెన్న అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకల కార్యక్రమంలో ఎస్ఐ శివ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పల్లెటూరి వాతావరణం మధ్య భోగి మంటలు, చిన్నారుల సాంప్రదాయ వేషధారణల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎస్ఐ మాట్లాడుతూ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ప్రయాణాల్లో పాటించాల్సిన నియమాలపై అవగాహన కల్పించి హెల్మెట్లను పంపిణీ చేశారు. చిన్నారులకు భోగి పళ్ళ పోసి,సంక్రాంతి పండుగ ఆనందానికి, సంతోషానికి ప్రతీక అన్నారు. అనంతరం ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.